ఆంధ్రాకి ఆయిట్మెంట్ రాసిన కేంద్రం ..

 central govt giving package not special statusఆంధ్రాకి ప్రత్యేక హోదానా? ప్యాకేజా ? ఈ అంశంపై ఇటు ఏపీ గల్లీలో,అటు ఢిల్లీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్న వేళ కేంద్రం ఓ స్టెప్ తీసుకుంది.ఆర్ధికంగా ఎదురీదుతున్న ఆంధ్రాకి 1976 కోట్ల నిధులు విడుదల చేసింది.ఇందులో ఆర్ధిక లోటు భర్తీ కింద 1176 కోట్లు ,రాజధాని నిర్మాణానికి 450 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 350 కోట్లు ఇచ్చింది. 

హోదాని పక్కనబెట్టి ప్యాకేజ్ కి ఆంధ్రాని ఒప్పించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో తాజాగా నిధుల విడుదల ఓ భాగమే అనిపిస్తోంది.మరొకొందరు సరదాగా ఆయిట్మెంట్ రాసి హోదా సెంటి మెంట్ కనపడకుండా చూస్తోందని కేంద్రం మీద సెటైర్లు పేలుస్తున్నారు.

Post Your Coment
Loading...