బాలయ్యకి సినిమా స్క్రిప్ట్ పై బాబు సలహా?

Posted February 7, 2017

chandrababu advice to balakrishna about ntr biopic
చంద్రబాబు,బాలయ్య భేటీ అయ్యారు.ఈసారి భేటీకి ఎంతో ప్రాధాన్యముంది.వాళ్లిద్దరూ ఎప్పుడు సమావేశమైనా రాజకీయం,కుటుంబ విషయాలు చర్చకి వస్తాయి అనుకుంటాం.కానీ తాజా సమావేశంలో ఆ ఇద్దరి మధ్య రాజకీయ అంశాలతో పాటు ఓ సినిమా స్క్రిప్ట్ విషయమై చర్చ జరిగింది.అదే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా .బాలయ్య సినిమా ప్రకటన చేసిన వెంటనే వివిధ వర్గాల నుంచి వచ్చిన స్పందన చూసి సినిమా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని బాలయ్యకి బాబు సూచించారు.లక్ష్మీపార్వతి సహా వివిధ పాత్రల చిత్రీకరణ గురించి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా బాలయ్యకి బాబు చెప్పారట.బాబు క్యారెక్టర్ ని హీరోగా చూపినా,ఎన్టీఆర్ జీవిత చరిత్రని మార్చినా ఈ సినిమా విషయంలో న్యాయపోరాటం చేస్తానని లక్ష్మీపార్వతి హెచ్చరికల నేపథ్యంలో ఈ సమావేశం కీలకమైంది.

ఇక బావాబావమరుదుల సమావేశంలో బాలయ్య పీఏ శేఖర్ మీద వచ్చిన ఆరోపణలు,ఆయన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి చర్చ సాగింది.హిందూపురం లో టీడీపీ నేతల అసంతృప్తి, ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా బాబు ,బాలయ్య చర్చించారు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY