బాబు రాజగురువు మారాడా?

0
2031

Posted November 26, 2016 (2 weeks ago)

 

chandrababu advisor abn radhakrishna not ramoji raoఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజగురువు ఈనాడు అధినేత రామోజీ అంటూ విస్తృత ప్రచారం సాగింది.నిజంగానే ఒకప్పుడు ఈనాడులో వ్యక్తమయ్యే అభిప్రాయాన్ని బట్టే బాబు ఆలోచన సాగేదంటారు.బాబుకి ఏదైనా సమస్య వస్తే సలహా కోసం రహస్యంగా ఫిలిం సిటీ కి వెళ్లి రామోజీని సంప్రదించేవారని కూడా అప్పట్లో టాక్.అయితే కాలంతో వచ్చిన మార్పో లేక ఇద్దరి మధ్య సంబంధాల్లో వచ్చిన మార్పో గానీ ఈనాడులో టీడీపీ అనుకూల వార్తల కన్నా మోడీ కి మద్దతిచ్చే కధనాలు పెరిగాయి.ఆ లోటుని ఇప్పుడు బాబుకి ఎవరు తీరుస్తున్నారని చూస్తే ABN రాధాకృష్ణ ముందు వరసలో కనపడుతున్నారు.

ఇటీవల ఆంధ్రజ్యోతి లో చంద్రబాబు నిరంతర,సుదీర్ఘ టెలి కాన్ఫరెన్స్ లు అధికారులకి,పాలన కి ఇబ్బందిగా మారాయని ఆర్కే వ్యాసం రాసిన రెండు రోజుల్లోనే ఆ విధానంలో మార్పులు చేస్తున్నట్టు సీఎం పేషీ నుంచి సమాచారం వచ్చింది.ఐటీ సెక్రటరీ గా ఉన్న ప్రద్యుమ్న వ్యవహారశైలి మీద ఆంధ్రజ్యోతిలో కధనం వచ్చిన గంటల్లోనే ఆయనకు చలనం తప్పలేదు.ఆయన్ను ఆ బాధ్యతల నుంచి బాబు తప్పించేసారు.ఇదంతా చూస్తుంటే బాబుకి ఆర్కే రాజగురువుగా అవతరించారా అన్న సందేహం రాక మానదు.అయితే ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే …బాబు తాను అనుకున్నది చేయడానికి ఆంధ్రజ్యోతి ద్వారా చెప్పించి చేసేస్తాడన్న వాదనలు కూడా లేకపోలేదు.ఏదేమైనా తాజా ఎపిసోడ్ తో అధికారులు ఇక ఆంధ్రజ్యోతిలో నెగటివ్ వార్తలొస్తే తేలిగ్గా తీసుకోలేరు.ఐఏఎస్ అధికారుల బదిలీల గురించి బాబు సర్కార్ పరిశీలిస్తున్న టైం లో జ్యోతి కధనాలు ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయం.

NO COMMENTS

LEAVE A REPLY