జగన్ బ్యాడ్- పవన్ గుడ్… బాబు

  chandrababu bad fellow pawan good  fellow

అసెంబ్లీ లో ప్రతిపక్షం తీరు మంచిపద్దతి కాదు.

స్పీకర్ చైర్ ను అందరూ గౌరవించాలి.

స్పీకర్ స్థాయిని దిగజార్చే విధంగా వ్యవహరించారు.

వాయిదా తీర్మానం పై ప్రతిపక్షం తీరు సరిగాలేదు.

విభజన చట్టం అంశాలపై చర్చ జరగాల్సి ఉంది.

విభజన బిల్లు సమయంలో జగన్ పార్లమెంట్ లో మాట్లాడకుండా ఏం చేసాడు.

ఎంత బాధ ఉన్నా.. హద్దులు దాటకూడదు.

నాయకుడు తీరు సభ్యులను తప్పుదారి పట్టిస్తుంది.

ఉన్మాద చర్యలకు పాల్పడ్డారు.. తీరును ఖండిస్తున్నాను.

రాష్ట్రం అంటే జగన్ ఒక్కడే కాదు.. 5 కోట్ల జనాభా.

అభివృద్ధి ని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్నారు.

పోలవరం, పట్టిసీమను, రాజధానిని అడ్డుకున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడా రాజీపడలేదు.

అరుణ్ జైట్లీ స్టేట్ మెంట్ పై సుదీర్ఘంగా చర్చించాం.

విభజన నాటి నుంచి ప్రాజెక్టు ఖర్చు వంద శాతం కేంద్రమే భరిస్తుంది.

అన్ని అంశాలపై చట్ట బద్దత అడిగాం.

పోలవరం కోసం 50వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది.

ప్రత్యేక హోదా పై.. 14వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదించారు.

రాజధాని కోసం 2500 కోట్లు ఇచ్చారు.. మరో వెయ్యి కోట్లు ఇస్తామన్నారు.

వెనుకబడిన జిల్లాలకు 1050కోట్లు ఇచ్చారు.

విశాఖపట్నం లొనే రైల్వే జోన్ రావాలి..రాజిలేదు.

2 సంవత్సరాల్లో ఇబ్బందులున్నా అభివృద్ధి సాధించాం.

విభజన చేసిన విధానం తప్పు.

షెడ్యూల్ 10, షెడ్యూల్ 9 సమస్యలు కేంద్రం పరిష్కరించాల్సి ఉంది.

తెలంగాణా కు అన్యాయం జరగటానికి వీలు లేదు.. అదే సమయంలో ఏపీకి న్యాయం జరగాలి.

ప్రత్యెక హోదా తో ఇన్సెంటివ్స్ వస్తాయని నమ్మకం ఉందా.

హోదాతో వచ్చే అన్ని అంశాలు ఏపీకి ఇవ్వాలి.

హోదాపై పార్లమెంట్ లో మాట్లాడకుండా , కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తీ నన్ను రాజీనామా చేయాలనటం బాధాకరం.

హైదరాబాద్ లాంటి నగరం నిర్మించాలంటే 5లక్షల కోట్లు ఖర్చవుతుంది. 20 సంవత్సరాలు పడుతుంది

దానికి కట్టుబడి ఉన్నాను.

కేంద్రం ఇచ్చిన హామీలను అన్ని అమలు చేయాలి.

వైసీపీ బంద్ తో ఎవరికీ నష్టం.. రాష్ట్రాన్ని మరింత నష్టాల్లోకి నెడతారా.

ఢిల్లీ కి వెళ్ళండి.. కేంద్రానికి చెప్పండి.

మద్దతు ఉపసంహరించుకుంటే వచ్చే ప్రయోజన లేదు.

పవన్ కళ్యాణ్ నిజాయితీ గానే మాట్లాడుతున్నారు.

రాజీనామా చేస్తా.. కేంద్రం నుంచి డబ్బులు ఎవరు తెస్తారు.

ప్రత్యేక హోదా స్థానంలో.. సమాన అంశాలు ఇస్తామన్నారు.

Post Your Coment
Loading...