దేవినేని ఉమాపై బాబు అసంతృప్తి..!

Posted February 1, 2017 (4 weeks ago)

chandrababu disappointed on devineni uma
చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన మంత్రుల్లో దేవినేని ఉమా ఒకరు. సమర్థవంతమైన మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయనపై బాబుకు గట్టి నమ్మకం. అలాంటి ఉమాపై అసంతృప్తి వ్యక్తం చేశారట బాబుగారు. వంశధార నిర్వాసితుల సమస్య విషయమే ఈ అసంతృప్తికి కారణమని తెలుస్తోంది.

వంశధార నిర్వాసితుల సమస్య గతంలో చంద్రబాబు దృష్టికి వెళ్లగానే… ఆయన స్పందించారు. నిర్వాసితులకు అభయమిస్తూ వెంటనే జీవో విడుదలైంది. కానీ ఇప్పటిదాకా వారికి న్యాయం జరగలేదు. మరోసారి బాబు దృష్టికి సమస్యవెళ్లింది. దీంతో చంద్రబాబు.. దేవినేని ఉమాకు క్లాస్ తీసుకున్నారని టాక్. సీనియర్ అయిన మీరే ఇలా చేస్తా.. ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే ఉమా దీనిపై సరైన వివరణ ఇవ్వడంతో బాబు కొంత వెనక్కు తగ్గారని సమాచారం.

అధికారుల జాప్యంతోనే వంశధార నిర్వాసితులకు న్యాయం జరగలేదని టాక్. ఇది కాస్తా దేవినేని ఉమాకు ఇబ్బందిగా మారింది. అయినా ఆయన తప్పును అధికారులపై వేయకుండా… ఆ నిందను తనపై వేసుకున్నారట. మొత్తానికి అధికారుల తప్పుకు దేవినేని ఉమా బలికావడంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ ఇష్యూతో అందరికీ ఒక సిగ్నల్ మాత్రం వెళ్లింది. అదేంటంటే పాలన విషయంలో బాబు కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదని..!!

NO COMMENTS

LEAVE A REPLY