ఆర్కే వ్యూహంతో చిరుకి డేంజర్..బాబు ఫైర్ ?

 Posted April 28, 2017 (4 weeks ago) at 16:37

chandrababu fires on tdp leader chiranjeevi because of alla ramakrishna wins in mangalagiri by elections
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పినంత తేలిగ్గాదు పరాజయాన్ని అంగీకరించడం.ఏపీ సీఎం చంద్రబాబు,ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి లోకేష్ ఇప్పుడు అదే పరాజయ భారంతో రగిలిపోతున్నారు.ఆర్కే చేతిలో ఓడిపోయినందుకు కుతకుతలాడుతున్నారు. చిరంజీవి మీద ఫైర్ అయిపోతున్నారు ఈ తండ్రీకొడుకులు.ఆర్కే,చిరు,చంద్రబాబు,లోకేష్ ..

ఇలా పొంతన లేకుండా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా ? అదేమీ లేదు..టైటిల్స్ సేమ్. మనుషులే మార్పు.ఇంతకీ అసలు మేటర్ ఏంటో చూద్దామా ?

ఇటీవల కొన్ని మునిసిపల్ వార్డుల ఉపఎన్నికలు జరిగాయి గుర్తుందా ? అందులో 90 శాతం టీడీపీ వశమయ్యాయి.కానీ ఆ పార్టీ హైకమాండ్ కి సంతోషం లేదు.అందుకు కారణం పంటి కింద రాయిలా ఒకే ఒక్క ఓటమి.అది కూడా రాజధాని పరిధిలోకి వచ్చే మంగళగిరి లోని ఓ వార్డ్ ఉపఎన్నికలో కావడంతో చంద్రబాబు ,లోకేష్ బాగా హర్ట్ అయ్యారు.లోకల్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ఎత్తుల ముందు టీడీపీ నిలవలేకపోయింది.

ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని టీడీపీ అధినేత చంద్రబాబు,లోకేష్ సీరియస్ గా ఈ అంశం పై దృష్టి పెట్టారు.స్థానిక టీడీపీ నేత,2014 ఎన్నికల్లో ఆర్కే చేతిలో ఓడిపోయిన గంజి చిరంజీవి ఒంటెత్తు పోకడలే పార్టీకి నష్టం చేకూర్చాయని వారి విచారణలో తేలిందట.నిరుద్యోగుల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేసి సొమ్ము చేసుకుని ఇటీవల పోలీసులకి చిక్కిన హరిబాబు కూడా చిరు శిష్యుడని స్థానిక నేతలు లోకేష్ ముందు చెప్పారట.మంగళగిరి లో ఓటమి చిరంజీవి నిర్వాకమని తేలడంతో ఆయనపై చర్యకు చంద్రబాబు,లోకేష్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Post Your Coment
Loading...