బాబుకి క్యాబినెట్ మంట..

 Posted April 1, 2017 (4 weeks ago)

chandrababu get struggles on new cabinet minister list
క్యాబినెట్ విస్తరణ,పునర్వ్యవస్థీకరణ ఇన్నాళ్లు సీఎం చంద్రబాబు ఇంతగా భయపడ్డానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుస్తోంది.రేపు ఉదయం క్యాబినెట్ ముహూర్తం పెట్టుకుంటే ఇప్పటికీ ఆ జాబితా రెడీ చేయడం బాబు వల్ల కాలేదు.అందరూ పదవి కావాలనే వాళ్ళే.ఒత్తిళ్లు తెచ్చేవాళ్ళు కోకొల్లలు.ఈ ఉదయం నుంచి పదవి రాని వాళ్ళని బుజ్జగించడం ఓ పని అయితే …ప్రత్యర్థులకు పదవి ఇస్తుంటే అడ్డుపడేవాళ్ళని సముదాయించడం అంతకు మించిన పని అవుతోంది.ఈ ఉదయం నుంచి బాబుకి ఇదే పని సరిపోయింది.అయినా పరిస్థితి ఇంకా కొలిక్కి రాలేదు.బాబు నేరుగా కొందరితో మాట్లాడితే,ఫోన్ లో మరి కొందరిని బుజ్జగించారు.

ఉదయాన్నే హిందూపురం ఎమ్మెల్యే,బావమరిది బాలయ్యతో బాబు భేటీ అయ్యారు.మంత్రివర్గంలో మార్పులు,చేర్పులు గురించి మాట్లాడారు.ఆ తరువాత బాబుని కలిసిన జేసీ దివాకర్ రెడ్డి అనంత నుంచి పయ్యావులకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.బొజ్జల కూడా బాబుని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.వీళ్ళతో చర్చలు సాగుతుండగానే కడప,విజయనగరం జిల్లాల నుంచి పెద్ద ఇబ్బంది వచ్చిపడింది.సుజయ కృష్ణ రంగారావు కి మంత్రి పదవి ఇస్తే ఊరుకోబోమని విజయనగరం నేతలు బాబు మీద ఒత్తిడి తెచ్చారు.ఇక కడప విషయం మరీ రచ్చగా తయారైంది.ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని రామసుబ్బారెడ్డి సహా జిల్లా ముఖ్య నేతలు ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు కి అల్టిమేటం ఇచ్చారు.దీంతో రామసుబ్బారెడ్డి ని పిలిపించుకుని బాబు ఆయనకి ఆర్టీసీ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. అయితే ఆయన మెత్తపడలేదని తెలుస్తోంది.అటు గుంటూరు జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు యరపతినేని,జీవీజీ ఆంజనేయులు,నరేంద్ర కూడా తమ తమ పద్ధతుల్లో మంత్రి పదవుల కోసం బాబుకి విన్నపం చేసుకున్నారు.వీరందరికీ నచ్చజెప్పడం బాబుకి తలకు మించిన పనైంది.

Post Your Coment
Loading...