బలరాంకి ఎమ్మెల్సీ..గొట్టిపాటికి మంత్రి కోసమేనా?

Posted March 28, 2017 (4 weeks ago)

chandrababu giving to mlc seat balaram because of will gottipati ravi ap minister
ప్రకాశం జిల్లాలో ఉప్పునిప్పులా ఉండే బలరాం,గొట్టిపాటి వర్గాల మధ్య సంధి కుదర్చకపోయినా…వారి యుద్ధ క్షేత్రం అద్దంకిలో శాంతి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు,యువనేత లోకేష్ గట్టి ప్రయత్నమే చేశారు.అందులో భాగమే బలరాంకి ఇటీవల దక్కిన ఎమ్మెల్సీ పీఠం.అద్దంకి స్థానంలో రెండు వర్గాల మధ్య వైరానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ,వచ్చే ఎన్నికల్లో రవికి అద్దంకి సీట్ ఖరారు చేయడానికే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అంతా అనుకున్నారు.బలరాం వర్గంతో సహా..అయితే అంతకు మించిన కారణం ఉందని టీడీపీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చే జాబితాలో గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా ఉందట.ఆయన వైసీపీ లో వున్నప్పుడు,టీడీపీ లో చేరేటపుడు, ఆపై బలరాం వర్గం గొడవలు పడినప్పుడు…ఇలా ప్రతి సందర్భంలో రవి వ్యవహారశైలి బాబు,లోకేష్ ని బాగా ఆకట్టుకుందట.అందుకే ఈసారి మంత్రివర్గంలోకి గొట్టిపాటి రవికుమార్ ని తీసుకునే విషయం మీద సీరియస్ కసరత్తే చేశారు.అందుకే ఎమ్మెల్సీ ప్రకటనకు ముందు బలరాం,ఆయన కుమారుడు వెంకటేష్ ని పిలిపించి ఇకపై అద్దంకిలో ఏ ఇబ్బంది రాకూడదని హామీ తీసుకున్నారట. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వెంకటేష్ కి ఏదో ఒక స్థానంలో అవకాశం ఇస్తామని కౌంటర్ హామీ ఇచ్చారట.ఒక్కసారిగా ఇన్ని వరాలు ఏమిటా అని బలరాం ఆశ్చర్యపోయారట.అందుకు తగ్గట్టే ఇప్పుడు రవికి మినిస్ట్రీ అన్న మాట బయటికి వచ్చింది.

Post Your Coment
Loading...