టీటీడీ రేసులో కొత్త పేర్లు …

Posted May 19, 2017 (6 days ago) at 12:33

chandrababu select two members for ttd chairman to tripuraneni hanuman chowdary and former ias lakshmi narayana
టీటీడీ చైర్మన్ గిరీ కోసం ఈసారి ఎన్నడూ లేనంతగా పోటీ ఏర్పడింది.మంత్రివర్గంలో చోటు దొరకని టీడీపీ నేతలంతా టీటీడీ లో పాగా వేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక భక్తి మార్గంలో అదో అద్భుత అవకాశంగా భావించే నేతలు టీటీడీ పోస్ట్ కోసం చంద్రబాబు వద్ద గట్టిగానే తమ వాదన వినిపించారు.ఇంత పోటీ ఊహించని బాబు కూడా టీటీడీ చైర్మన్ గిరీ కోసం కొత్త పద్ధతి ఫాలో అవ్వడానికి డిసైడ్ అయ్యారు.లేకుంటే లేనిపోని సమస్యలు వస్తాయని ఆయన భావిస్తున్నారట.అలా రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని పేర్లు కొన్నిటిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

టీటీడీ రేసులో వినిపిస్తున్న కొత్త పేర్లలో ఒకటి త్రిపురనేని హనుమాన్ చౌదరి అయితే ఇంకోటి మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ.త్రిపురనేని హనుమాన్ చౌదరి కి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ దక్కింది.ఆయన హిందుత్వ కి కట్టుబడినవారు.బీజేపీ,vhp లతో దగ్గర సంబంధాలు వున్న వ్యక్తి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం పునాదులు నిలదొక్కుకోడానికి హనుమాన్ చౌదరి కృషి చేశారు.అప్పటి సీఎం చంద్రబాబుకి ఐటీ సలహాదారుగా కూడా పని చేశారు.

ఇక టీటీడీ రేసులో వినిపిస్తున్న ఇంకో పేరు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ.శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో చంద్రబాబుకి బ్యాచ్ మెట్ అయిన ఈయన ఉమ్మడి ఏపీలో బాబు సీఎం గా వున్నప్పుడు ఆయన పేషీలో ఓఎస్డీ గా బాధ్యతలు చూసారు.ఇప్పుడు కూడా బాబుకి ఎన్నో విషయాల్లో చేదోడువాదోడుగా వుంటున్నారు.ఈ ఇద్దరి పేర్లు టీటీడీ చైర్మన్ గిరీ కోసం పరిశీలిస్తున్నారు అంటే ఓ విధంగా రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకే అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Post Your Coment
Loading...