పుష్కరాలు పై బాబు టెలీ కాన్ఫరెన్స్

  chandrababu teleconference pushkaralu employees
కృష్ణా పుష్కరా విధి నిర్వహణలో అలక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలని  సీఎం చంద్రబాబునాయుడు అధకార యంత్రాంగాన్ని 
ఆదేశించారు. పుష్కరాల రెండో రోజు ఏర్పాట్లపై సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1020 మంది అధికారులు, సిబ్బందితో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పుష్కరాలకు వచ్చిన యాత్రికులందరినీ సంతృప్తిగా పంపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.
పవిత్ర భావనతో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు  చేస్తున్నామని, ప్రభుత్వం బాగా చేసిందన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలని, అందుకోసం స్ఫూర్తితో పని చేయాలని, విధి నిర్వహణలో అలక్ష్యం  ఉండకూడదని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. పుణ్యస్నానాలకు వచ్చే వికలాంగులు, వృద్దులకు హోం గార్డులు సాయపడాలని, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా వుండాలని అయన అన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. సిబ్బంది అన్ని ప్రాంతాలకు వెళ్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలిని సూచించారు. నీళ్లలో  వ్యర్థాలను తొలగించేందుకు వలలు వినియోగించాలని, పుష్కర్ నగర్ లు, రహదారులపై చెత్త లేకుండా పారిశుద్ధ్య సిబ్బంది చూడాలని అన్నారు. పుష్కర  ఘాట్ల వద్ద పారిశుద్ధ్య బాధ్యతలను అగ్నిమాపక సిబ్బంది, నీళ్లలో పారిశుద్ధ్య బాధ్యతలను మత్స్య శాఖ సిబ్బంది చూడాలని అన్నారు.
ఎక్కడా వ్యర్థాలు  పోగవకుండా చూడాలని, ప్రతి ఘాట్ వద్ద వాటర్ లెవెల్ ఇండికేటర్లు ఏర్పాటు చేయాలని, నీటిమట్టం లోతు తెలిస్తేనే యాత్రికులు అప్రమత్తంగా ఉంటారని,  సెలవు రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి చంద్రబాబు సూచించారు.
శానిటేషన్ పై సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, సిబ్బంది అంతా ఒకేచోట వుండకుండా అన్ని ప్రాంతాలకు వెళ్లి పారిశుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు  నీళ్లల్లో వ్యర్ధాలు తొలగించాలని అన్నారు.
ప్రతిఘాట్ వద్ద వాటర్ లెవల్ ఇండికేటర్లు ఉపయోగించాలని అన్నారు. రెండో రోజు రద్దీ పెరిగిందని, మరింత అప్రమత్తంగా వుండాలన్నారు. నీళ్లు బాగాలేవు, బాక్టీరియా వుందని కొందరు చేస్తున్న దుష్ర్పాచారాన్ని ఖండించాలని, ఈ విధమైన ప్రచారాన్ని మీడియా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. స్వామీజీలు, పీఠాధిపతులు ఈరోజు కుడా పుష్కర స్నానం చేసిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY