తారక్ కు షాక్ ఇచ్చిన చరణ్..!

0
36

Posted November 26, 2016 (2 weeks ago)

 

Image result for ram charan dhruva movie trailer

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రీలర్ నిన్న సాయంత్రం ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. కేవలం నాలుగే నాలుగు గంటల్లో 1 మిలియన్ వ్యూస్ తో ధ్రువ చరణ్ ఓ సరికొత్త రికార్డ్ షురూ చేశాడు. మెగా పవర్ స్టార్ స్టామినా ఏంటో ఈ సినిమా చూపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాలోని కంటెంట్ నే కాదు సినిమా అవుట్ పుట్ ను కూడా డిసైడ్ చేస్తుంది.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించారు. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. హిప్ హాప్ తమిజ మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి సినిమా అంచనాలను మరింత పెంచాలని చూస్తున్నారు.

యూట్యూబ్ లో చెర్రి రికార్డ్ మరే హీరో క్రాస్ చేస్తాడో ఏమో కాని ఇప్పటిదాకా జనతా గ్యారేజ్ మాత్రం 10 గంటల్లో మిలియన్ వ్యూయర్స్ సాధించింది. ఈ క్రమంలో ధ్రువ కేవలం ఫోర్ అవర్స్ లో ఆ రికార్డ్ సాధించడం మాములు విషయం కాదు.

NO COMMENTS

LEAVE A REPLY