ఇందిర,ఎన్టీఆర్ కన్నా వై .ఎస్ .గొప్పా?

  chevireddy bhaskar reddy said ys rajasekhar reddy greater than ntr indira gandhi rajeev gandhi
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దివంగత నేత వై.ఎస్ ని తల్చుకుని నన్ను కన్నతండ్రి కన్నా బాగా చూసుకున్నారని చెప్పి బోరున ఏడ్చారు చెవిరెడ్డి.అంతటితో ఆగలేదాయన….ఇందిర,రాజీవ్ ,ఎన్టీఆర్ చనిపోయాక ఏడాదిలోపే వాళ్ళని జనం మర్చిపోయారని …వై.ఎస్ చనిపోయి ఏడేళ్లు అయినా ఇంకా జనం ఆయన్ను మర్చిపోలేకపోతున్నారని చెవిరెడ్డి అన్నారు.ఎవరి అభిమానం వాళ్ళది …పైగా చనిపోయిన నేతల మధ్య పోటీ తెచ్చి మాట్లాడ్డం ఎంతవరకు సమంజసమో చెవిరెడ్డి ఆలోచించుకోవాలి..

Post Your Coment
Loading...