పసి పిల్లలకు ఫోటోలు తీస్తే….?

 

Posted October 6, 2016

   Chinese baby permanently blinded  camera flash.

మన జీవితంలో ఎలాంటి విషయం జరిగినా పక్కవారికి తెలిసే లోపే ఫేస్ బుక్ లో స్టేటస్ లాగా పెట్టేస్తున్నారు. ఇక ఫోటోల సంగతి చెప్పనక్కర్లేదు. అసలు ఈ కాలం లో ఫోటోలు దిగేది కేవలం ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సైట్లలో పెట్టేందుకే అని వేరేగా చెప్పనవసరంలేదు.

ఇప్పుడు ఇలాంటి పొరపాటే ఓ మూడు నెలల పసికందు కంటి చూపుని పోగొట్టింది. చైనా కు చెందినా దంపతులకు బాబు పుట్టాడు. బాబు పుట్టి కేవలం మూడు నెలలే కావొస్తుంది. తమ బంధుమిత్రులకు ఈ సమాచారాన్ని అందజేశారు. వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకతను బాబుని చూడడానికి వచ్చాడు. ముద్దులొలికే పసి కందు ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెడదాం అనుకున్నాడు ఆ వ్యక్తి. తన ఫోన్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మరచిపోయి అలాగే ఫోటోలు తీశాడు.

ఫోటోలు తీసిన వెంటనే బాబు కళ్ళు తేడాగా కనిపీయడంతో వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళారు. కాని అప్పటికే బాబు కళ్ళు దెబ్బతిన్నాయి. బాబు ఎడమ కన్ను బాగా దెబ్బతింది.. కుడి కన్ను పూర్తిగా చూపిని కోల్పోయిందని డాక్టర్ వెల్లడించారు. చూపు తెప్పించడానికి వారు ఏమి చేయలేరని… ఆపరేషన్ ద్వారా కూడా అది అసాధ్యమని తేల్చి చెప్పేశారు. దీంతో ఆ తల్లితండ్రులు తల్లడిల్లారు. పసికందు జీవితం చిన్న సరదా కోసం బలైపోయిందని భాధపడ్డారు.

మన కంట్లో ఉండే మాక్యులా అనేది పూర్తిగా డెవలప్ అవ్వడానికి కనీసం 4 సంవత్సరాలు పడుతుంది. ఇక చిన్న పిల్లల కళ్ళల్లో మాక్యులా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఏదైనా స్ట్రాంగ్ లైట్ ని చూసినప్పుడు ఇది దెబ్బతింటుంది. పొరపాటున ఇది దెబ్బతింటే ఆపరేషన్ ద్వారా కూడా దాన్ని బాగు చేయలేం అంటున్నారు డాక్టర్లు. కేవలం ఒక సెకను కూడా చిన్న పిల్లలు ఫ్లాష్ లాంటి స్ట్రాంగ్ లైట్ ని చూస్తే వారి మాక్యులా దెబ్బతినే అవకాశముందట.

మీరు కూడా ఇలాంటి పొరపాటు చేయకండి. ముఖ్యంగా రాత్రి వేళలో 4 సంవత్సరాల లోపు పిల్లల ఫోటోలు ఎట్టి పరిస్థితిలోను తీయకండి. ఎవరైనా తీస్తున్న వారికీ ఈ విషయంపై అవగాహన కలిపించండి.

NO COMMENTS

LEAVE A REPLY