‘MEK’ కోసం చిరు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

0
113

Posted October 14, 2016

 chiranjeevi remuneration meelo evaru koteeswarudu program

‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ అంటూ బుల్లితెరపై కింగ్ నాగార్జున తెగ హడావుడి చేసేశారు. ఇప్పుడీ ప్రోగ్రామ్ కి కావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. ఈ ప్రోగ్రామ్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

తాజాగా, ఈ సూపర్ హిట్ బుల్లితెర ప్రోగ్రామ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బటికొచ్చింది. ‘MEK’ కోసం మెగాస్టార్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో ఒక్క ఎపిసోడ్ కోసం చిరు 10ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, బుల్లితెర ప్రోగ్రామ్ ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం సాధ్యంకాదంటున్నారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. మొదట ఐటమ్ భామగా
తీసుకొన్న కేథరిన్ ని కొన్ని కారణాల వల్ల తొలగించి ఆమె స్థానంలో లక్ష్మీరాయ్ ని తీసుకొన్నారు. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. ఈ
చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత.

NO COMMENTS

LEAVE A REPLY