150వ సినిమా తరహాలోనే 151కి ఫ్యాన్స్‌ నిరాశ

Posted April 25, 2017 (5 weeks ago) at 11:51

chiru 151 movie uyyalawada narasimha reddy shooting delay
మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా కోసం ఫ్యాన్స్‌ దాదాపు మూడు సంవత్సరాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. దాదాపు పది సంవత్సరాల గ్యాప్‌ తర్వాత చిరంజీవి 150వ సినిమాను చేసిన విషయం తెల్సిందే. మెగా మూవీ అదిగో, ఇదిగో అంటూ ముందుకు జరుపుతూ వచ్చారు. ఎట్టకేలకు గత సంక్రాంతి సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేసింది. ఆ సినిమా సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని, సంవత్సరంలో రెండు సినిమాలను మీ ముందుకు తీసుకు వస్తానంటూ చెప్పుకొచ్చాడు.

150వ సినిమా విడుదలైన వెంటనే 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని ప్రకటించిన విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మాణంలో భారీ అంచనాల నడుమ ఆ సినిమా నిర్మాణం జరుగనుంది. ఫిబ్రవరి నుండి ఉయ్యాలవాడ సినిమాను పోస్ట్‌ పోన్‌ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఎక్కువ ఎండలు ఉండటం వల్ల వాయిదా వేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా నిర్మాత చరణ్‌ మెగా 151వ సినిమాను ఆగస్టులో ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో ఫ్యాన్స్‌ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో మెగా 151 సినిమా విడుదల కానట్లే అని తేలిపోయింది.

Post Your Coment
Loading...