చిరు హీరో ..పవన్ నిర్మాత..త్రివిక్రమ్ డైరెక్షన్?

0
191

Posted December 1, 2016 (1 week ago)

Image result for chiru pawan and trivikram
మెగాస్టార్ చిరంజీవి ….సెన్సషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య రహస్య చర్చలు జరిగినట్టు ఫిలిం నగర్ టాక్.ఈ చర్చలు ఎందుకు జరిగాయన్నదానిపై మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ నిర్మాతగా,త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తీయబోతున్నారని ..దానికి సంబంధించిన కథ ని ఈ రహస్య భేటీలో త్రివిక్రమ్ వివరించినట్టు తెలుస్తోంది.ఈ సినిమా విషయంలో పవన్ చొరవ తీసుకున్నప్పటికీ అయన తరపున పనులు చక్కదిద్దడానికి త్రివిక్రమ్ ని ఎంచుకున్నట్టు సమాచారం.అన్ని అనుకున్నట్టు జరిగితే 2017 చివరిలో ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందట.

మరోవైపు త్రివిక్రమ్ తో జరిగిన భేటీలో ఖైదీ నెంబర్ 150 గురించి కూడా చిరు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.కొన్ని సన్నివేశాల విషయంలో త్రివిక్రమ్ సలహా అడిగినట్టు చెబుతున్నారు . అయితే ప్రధాన చర్చంతా కొత్త సినిమా గురించే అంటున్నారు.నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మెగా ఫాన్స్ కి పండగే పండగ.వారి సంబరాలు అంబరాన్ని అంటడం ఖాయం.

NO COMMENTS

LEAVE A REPLY