చిరు దారి ఎటు?

Posted January 28, 2017 (4 weeks ago)

chiru upcoming movie uyyalawada narasimha reddy biopicఖైదీ నెం. 150 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్…  తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ ను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సురేందర్ రెడ్డిని దర్శకుడిగా కూడా సెలెక్ట్ చేశాడు చిరు. ఈ సినిమా క్లైమాక్స్ లో చిరు పాత్ర చనిపోవాల్సి ఉంటుంది. చివర్లో ఆ స్వాతంత్ర్య సమరయోధుడిని బ్రిటిషర్లు ఉరి తీసినట్లుగా చూపించాల్సి వస్తుంది. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కుతుండడంతో క్లైమ్యాక్స్ ను మార్చే అవకాశం కూడా ఉండదు.  

అయితే నెగిటివ్ ఎండింగ్స్ ని తెలుగు అభిమానులు అస్సలు ఇష్టపడరు. ఈ విషయంలో చిరు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. నిజానికి చిరు చేసిన బ్లాక్ బస్టర్ మూవీలు స్టాలిన్, ఠాగూర్ సినిమాల్లో కూడా హీరో చనిపోవాల్సి ఉంది. అయితే అందుకు ఇష్టపడని చిరు క్లైమ్యాక్స్ ని  మార్చేశాడు.

మరి ఇప్పుడు చేయబోయే సినిమాలో ఎండింగ్ ను ఎలా తీయాలి అనే డిస్కషన్స్ జరుగుతున్నాయట.  ఉరితీసే సీన్ ని చూపించకుండా,  ఉయ్యాలవాడ  నరసింహా రెడ్డిని ఉరి తీసారు అని కేవలం వాయిస్ ఓవర్ చెప్పించే యోచనలో ఉన్నారట.  మరి చిరు దారి ఎటు, ఏం చేయనున్నాడో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY