పుదుచ్చేరిలో సీఎం గెలిచాడు….

Posted [relativedate]

cm narayana swamy won in puducherry by electionsకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. పుదుచ్చేరి నెల్లితోప్పె అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్‌పై 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు.

గత మే 16న జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో వీ నారాయణస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, ఆయన శాసనసభ్యుడు కాకపోవడంతో ఉప ఎన్నికల బరిలోకి దిగారు. నారాయణస్వామి సీఎంగా కొనసాగాలంటే గెలువాల్సిన పరిస్థితి ఉప ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.