కాంగ్రెస్ ఒంటరి పోరాటం ఎక్కడ ?

0
68

 congress single war where
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంట రిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ చెప్పారు. ఏ ఒక్క పార్టీతోను పొత్తు పెట్టుకోబోమని అన్నారు. 2017లో జరిగే ఈ ఎన్నికల్లో ఫలితాలు ప్రతి ఒక్కరని అబ్బురపరు స్తాయని, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని త ప్పక ఏర్పాటు చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే, మీరు ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని మీడియా ప్రతి నిధులు ప్రశ్నించగా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని షీలా చెప్పా రు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఇప్పటికే బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమా జ్ పార్టీల పాలనను చూశారని, ఇప్పుడు వారంతా గొప్ప ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అభివృద్ధి నినాదంతో ప్రజల ముందు కువెెళ్లి వారి మద్దతు పొందుతామని చెప్పారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, మతం పేరిట దాడు లు పెరిగాయని షీలా ఆరోపించారు

NO COMMENTS

LEAVE A REPLY