4500 నుండి 2000… ఎందుకు అయ్యింది.?

0
31

Posted November 18, 2016 (3 weeks ago)

 

control the situation in the countryదేశంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, అల్లర్లు చెలరేగవచ్చునని సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది . పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ పలు రాష్ట్రాల హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు డబ్బులు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం న్యాయస్థానం ముందు అంగీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని కోరగా పెద్దసంఖ్యలో దాఖలైన ఈ పిటిషన్లు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయని, వివిధ హైకోర్టుల ముందు దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయించుకొని విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో నగదు బదిలీ పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2వేలకు ఎందుకు తగ్గించారని కేంద్రాన్ని ప్రశ్నించింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో మోదీ ప్రభుత్వ తీరునుసుప్రీంకోర్టు.తప్పు పట్టింది ఈ ఆకస్మిక నిర్ణయాన్ని రద్దుచేయాలంటూ పలు హైకోర్టులలో దాఖలైన పిటిషన్లపై విచారణ నిలిపివేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది .

NO COMMENTS

LEAVE A REPLY