సుమంత్ సినిమాకు కోర్ట్ షాక్..!

Posted November 3, 2016

sum1316సుమంత్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కి డోనార్ రీమేక్ గా నరుడా డోనరుడా సినిమా ఈరోజు రేపు అవ్వాల్సి ఉంది. కాని నిర్మాతలు తనకు సెటిల్ చేయాల్సిన ఎమౌంట్ పెండింగ్ పెడుతూ ఇప్పుడు ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారని.. తన డబ్బులు క్లియర్ అయ్యేదాకా సినిమా ఆపాలంటూ మార్కాపురం కు చెందిన ఫైనాన్షియర్ తాళ్లపల్లి ప్రసాద్ కోర్ట్ లో పిటీషన్ వేశారు.

పిటీషన్ స్వీకరించిన కోర్ట్ విషయం తేలే వరకు రిలీజ్ ఆపాలని షాక్ ఇచ్చింది. ఎన్నాళ్లకెన్నాళ్లకో సుమంత్ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి అలాంటిది ఈ సినిమా అనుకున్న టైంలో రాకుండా చేస్తున్నారు. మరి వ్యవహారం సర్ధుబాటు అయ్యి మధ్యాహ్నం కల్లా అయినా షోలో పడతాయో లేదో చూడాలి.

Post Your Coment
Loading...