ఆంధ్రాలో వజ్రాల వేట..

  daimonds searching ap

ప్రభుత్వరంగ మైనింగ్ సంస్థ ఎన్‌ఎమ్‌డిసికి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో వజ్రాల అన్వేషణకు కావాల్సిన అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో అత్యున్నత వ్యవస్థ అయిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఎసి) ఈ అనుమతిని ఎన్‌ఎమ్‌డిసికి అందించింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ అనుమతినిచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, ఈ అనుమతితో అనంతపురం జిల్లాలో 152 హెక్లార్ల విస్తీర్ణంలో ఎన్‌ఎమ్‌డిసి వజ్రాల అనే్వషణ చేపట్టనుంది. 64 బోర్లను వేయనుంది.

NO COMMENTS

LEAVE A REPLY