దేవి ఆ అనుభవం కోల్పోయాడు ..

  devi sri prasad loss that experience
దేవిశ్రీప్రసాద్ ..ఓ సంగీత సంచలనం ..ఇప్పుడు అయన తీసుకున్నట్టు చెప్తున్న ఓ నిర్ణయం కూడా సంచలనమే.అది …చిరు 150 వ సినిమా కోసం ..బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి వదులుకోవడం .రెండు సినిమాలకు పని చేసే సమయం చాలక దేవి ఈ నిర్ణయం తీసుకున్నాడని ఫిలిం నగర్ టాక్ .

అదే నిజమైనా ..మరేదైనా కారణమున్నా దేవి ఓ అరుదైన అనుభవాన్ని మాత్రం కోల్పోయాడని చెప్పక తప్పదు .ఈ కాలంలో చారిత్రక సినిమాలు ఎప్పుడో ఓ సారి వస్తాయి .కమర్షియల్ సినిమాలు ,విజయాలు దేవి కి కొత్త కాదు .ఓ కొత్త నేపధ్యం ఉన్న సినిమాకి పనిచేయడం సృజనాత్మక రంగంలోని వారికి నిజమైన సవాల్ ..దాన్ని అధిగమిస్తే నిజమైన ఆత్మసంతృప్తి .దేవి తప్పుకుంటే గౌతమీపుత్ర శాతకర్ణి కోసం కీరవాణి లేదా ఇళయరాజా పని చేసే అవకాశం ఉందని సమాచారం ..ప్రత్యామ్నాయాలే అంత దిగ్గజాలు అయినప్పుడు ..వచ్చిన అవకాశం ఎంత గొప్పదో దేవి కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Post Your Coment
Loading...