పళనిస్వామికి అంత సీనుందా?

Posted February 15, 2017 (2 weeks ago)

did palanisamy has stamina to rule the state
అన్నాడీఎంకేపక్ష నేతగా పళనిస్వామిని ఎంపిక చేయడం పెద్ద తప్పా? పళనిస్వామి ఎంపిక మళ్లీ సెల్వంకే కలిసి వస్తుందా? పళనికి కూడా కష్టాలు తప్పవా ? అంటే ఔననే అంటోంది సెల్వం వర్గం.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పళనిస్వామి బలమైన నాయకుడు కాదు. మొదటి నుంచి జయలలితకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందిన ఆయన.. అమ్మ మరణం తర్వాత శశికళ వర్గంలో చేరిపోయారు. గోల్డెన్ బే రిసార్టులో క్యాంపు మొదలైనప్పటి నుంచి .. ఆయనే కీలకపాత్ర పోషించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కీలక సూచనలు అందజేశారు. అందుకే 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సెంగొట్టయన్ కంటే..పళనిస్వామి వైపే శశికళ మొగ్గుచూపారు.

అసలే పళనిస్వామి వీక్ అంటే.. ఆయన కేసుల -ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు. పెద్దనోట్ల కేసులో ఇరుక్కున్న శేఖర్ రెడ్డితో పళనిస్వామి వియ్యంకుడికి సంబంధాలున్నాయి. ఆ సంబంధాలు ఇప్పుడు కొంప ముంచుతాయా.. అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. శేఖర్ రెడ్డి సాకుతో… పళినిస్వామిని కూడా టార్గెట్ చేస్తారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ విషయాలన్నీ తెలిసి కూడా పళనిస్వామికి శశికళ ఎంపిక చేయడం పెద్ద తప్పు అంటున్నారు అన్నాడీఎంకే నాయకులు. ఆయన ఎంపిక సెల్వంకే కలిసి వస్తుందని చెబుతున్నారు. పన్నీర్ సెల్వం కూడా…పళనిస్వామికి సంబంధించిన ఈవిషయాలకు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారట. అందుకే ఒకవేళ పరిస్థితులు తారుమారైతే.. పళనిస్వామి కూడా జైలుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY