డిగ్గీ రాజాకు అధిష్ఠానం షాక్

 Posted April 30, 2017 (5 weeks ago) at 12:04

digvijay singh shocked by centralపదేళ్లు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్.. ఆ తర్వాత కూడా అధిష్ఠానం దగ్గర మంచి పేరే సంపాదించారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన ఒక మేధావి అని గుర్తించిన సోనియా కీలక బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు డిగ్గీ మేధావితనమేంటో గోవా సాక్షిగా బట్టబయలైంది. మెజార్టీ ఎమ్మెల్యేలున్నా.. మద్దతిస్తామని ఇతర పార్టీలు ముందుకొచ్చినా డిగ్గీరాజా ఏమీ తేల్చిచెప్పకపోవడంతో.. గోవాలో కమలం రొట్టె విరిగి నేతిలో పడింది.

దీంతో గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితికి డిగ్గారాజానే కారణమని నిందించారు. ఆయన్ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధిష్ఠానం దిగ్విజయ్ కు ఖో చెప్పింది. దిగ్విజయ్ నిర్వాకం వల్లే గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయామని రాష్ట్ర కాంగ్రెస్ నుంచి సోనియాకు అంతర్గత నివేదిక వచ్చిందట.

గోవాలో దిగ్విజయ్ ను తప్పించగానే.. తెలుగు రాష్ట్రాల ఇంఛార్జ్ గా కూడా తప్పించాలని ఇక్కడ కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ కు మొరపెట్టుకుంటున్నారట. కానీ ఇక్కడ దిగ్విజయ్ కంటే మరో ముదురు నేత ప్రాణసంకటంగా తయారయ్యాడు. ఆయనే కొప్పులరాజు. అందుకే వీరిద్దర్నీ ఎంద దూరంగా ఉంచితే అంత మంచిదని ఇటు గాంధీ భవన్, అటు ఆంధ్ర రత్న భవన్ నుంచి ఏఐసీసీకి లేఖలు వెళ్లాయి.

Post Your Coment
Loading...