దువ్వాడ జగన్నాథం లో బన్నీ పని ఇదే?

Posted October 10, 2016

   dj duvvada jagannadham movie bunny character

ఈ మధ్యే ‘సరైనోడు’తో హిట్ కొట్టాడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “డీజె.. దువ్వాడ జగన్నాథం” చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ‘డీజె’.. ఈ నెల 21 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సెట్స్ పైకి కూడా వెళ్లకముందే ‘డీజె’పై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది.

అయితే, తాజాగా ‘డీజె’ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ హల్ చల్ చేస్తోంది. ‘బ్రాహ్మణ కుటుంబం కు చెందిన దువ్వాడ జగన్నాధం అగ్రహారం వదిలి
హైదరాబాద్ వస్తాడు. అక్కడ రౌడీ గ్యాంగ్ తో తలపడి పోలీసు ఉన్నతాధికారి దృష్టిలో పడతాడు. ఆ పొలీస్ ఆఫీసర్ ఇచ్చిన పని ఒప్పుకున్నసమయంలో హీరో
ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు ? చివరకు ఎలా విజయం సాధించాడు అన్నదే దువ్వాడ జగన్నాధం కథ’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజంగా డీజె కథ అయినట్టయితే.. సినిమాపై ప్రేక్షకుడు అటెన్షన్ మిస్సయినట్టే. ఇప్పటికైనా లీకులపై డీజె చిత్రబృందం జాగ్రత్తగా ఉంటే మంచింది.

మరోవైపు, సినిమా సినిమాకి కొత్త లుక్ తో అదరగొడుతోన్న.. స్టయిలీష్ స్టార్ డీజె కోసం ఓ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడట. ఇటీవలే బన్నీ కొత్త లుక్
లో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక, డీజె లో ద్విపాత్రభినయం చేయనున్న బన్నీ.. బ్రహ్మాణ పాత్రలో కనిపించనున్నాడట. ఈ చిత్రం థియేటర్ లో నవ్వులని పూయించడం ఖాయంగా చెబుతున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఇద్దరు బ్రాహ్మణులని నియమించుకొని బన్ని కోచింగ్ కూడా తీసుకుంటున్నాడట.

Post Your Coment
Loading...