జగన్,పవన్ మధ్య ఓ డాక్టర్?

Posted February 3, 2017 (4 weeks ago)

doctor in between pawan and jagan
జగన్ ,పవన్ …ఈ ఇద్దరూ గొప్ప రాజకీయ నేతలు కాకపోవచ్చు కానీ బలమైన ప్రజాకర్షణ ఉన్న కలిగినవారనడంలో ఏ సందేహం లేదు.అయితే రాజకీయంగా వీళ్ళిద్దరూ ఉత్తర,దక్షిణ ధృవాలు. చంద్రబాబు కి చెక్ చెప్పడానికి ఈ భిన్న ధృవాలు కలిసి పనిచేయాలని ఆశించేవాళ్ళు ఎంతో మంది. అలా ఆశిస్తున్న వారిలో పవన్,జగన్ కుటుంబాలతో చనువున్న ఓ డాక్టర్ కూడా ఒకరు.ఆయన వృత్తిరీత్యా రాజకీయాలకి దూరంగా వున్నా ప్రవృత్తి రీత్యా వాటిని జాగ్రత్తగా ఫాలో అవుతుంటారు. ప్రత్యేక హోదా పోరు నేపధ్యంగా జగన్,పవన్ ని ఒకే వేదిక మీదకి తెచ్చేందుకు ఈ డాక్టర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఇద్దరితో ఓ దఫా చర్చలు జరిపినట్టు సమాచారం. ఇద్దరూ కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ముందుగా ఎదుటివాళ్లే చొరవ తీసుకోవాలన్న అభిప్రాయంలో వున్నారు.అక్కడే కాస్త చిక్కుముడి పడింది.

జగన్,పవన్ మధ్య చిక్కుముడి విప్పడానికి సదరు డాక్టర్ ప్రయత్నిస్తున్నారు.అది ఎంతవరకు వచ్చిందో ఇంకా తెలియదు కానీ జగన్,పవన్ కలిసి బాబుకి వ్యతిరేకంగా పని చేయాలనుకుంటున్నవాళ్ళు మాత్రం ఆ సంచలన భేటీకి తమదైన డేట్స్ కూడా ఫిక్స్ చేసేసి సోషల్ మీడియా ద్వారా హోరెత్తిస్తున్నారు.అలా బయటికి వచ్చిన దాన్ని బట్టి జగన్,పవన్ ల భేటీకి డాక్టర్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఈ నెల 8 న లేదా 28 న వారిద్దరూ ఓ రహస్య ప్రదేశంలో సమావేశమయ్యే అవకాశముంది.అయితే వైసీపీ నేత గుడివాడ అమర్నాధ్ బాబుని ఎందుకు ప్రశ్నించవని పవన్ ని నిలదీయడంతో అసలు ఈ భేటీ ఉండకపోవచ్చని కూడా ఓ వాదన వినిపిస్తోంది.రాజకీయాలు వేగం గా మారుతున్న ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY