ఆమె కోసం లండన్ డాక్టర్ దిగొచ్చాడు..

Posted February 7, 2017 (3 weeks ago)

appolo chairmen pratap reddy about jayalalitha
జయ లలిత ఆరోగ్యం గురించి ఆమె మరణానికి ముందు,ఆ తర్వాత కూడా ఎన్నో సందేహాలు ..మరెన్నో వివాదాలు.అపోలో లో జయని పరామర్శించడానికి ఎంతటి వీఐపీ లకి కూడా సాధ్యం కాలేదు.కేవలం వైద్యులతో మాట్లాడి రావడమే తప్ప ..లోపల ఏమి జరుగుతుందో ఎవరూ చూడలేకపోయారు.ఇక సామాన్యులు,జయ అభిమానులకి ఆస్పత్రి ముందు నిలబడి రోదించడం తప్ప వేరే దారి కనిపించలేదు.ఎవరు ఎన్ని విధాలుగా భంగపడ్డా జయలలిత ఆరోగ్యం గురించి అపోలో వర్గాలు అప్పుడప్పుడు మొక్కుబడి హెల్త్ బులెటిన్స్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అంతకు మించి ఆమె ఆరోగ్యం గురించి బయటికి చెప్పే సాహసం చేయలేదు.అలాంటిది ఇటీవల జయ మరణంలో ఏ రహస్యాలు లేవని ,ఎలాంటి విచారణకైనా సిద్ధమని అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి చెప్పారు.ఆయన ప్రకటన వచ్చాకే శశికళ సీఎం పగ్గాలు అందుకోడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం నిర్దారణ అయింది.

ఓ వైపు జయ మరణం గురించి శశికళ మీద అన్నాడీఎంకే సీనియర్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న టైం లోనే జయ కి చికిత్స అందించిన లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే చెన్నైలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.తమిళ ప్రభుత్వం స్వయంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.ఇందులో జయ మరణం గురించి వస్తున్న అనుమానాలు నివృత్తి చేసేందుకు బీలే ప్రయత్నించారు.జయకి కాళ్ళు తొలిగించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని బీలే వివరించాడు.జయ బుగ్గ మీద కనిపిస్తున్న డాట్స్ తీవ్ర అనారోగ్యం తో బాధపడేవారికి వస్తాయని తెలిపాడు.జయ మరణం,చికిత్స లో ఏ రహస్యాలు లేవని చెప్పేందుకు ఆయన చెప్పారు.చేసిన వైద్యం గురించి చెప్పడంలో వింతేమీ లేకపోయినా ఇన్నాళ్లు ఎంతమంది ఎంతగా గగ్గోలు పెట్టినా నోరుతెరవని ఆయన శశి పీఠం ఎక్కడానికి ముందు రంగంలోకి దిగడం చూస్తుంటే ..ఆమె కోసమే లండన్ డాక్టర్ దిగొచ్చాడని చెప్పక తప్పదు.

NO COMMENTS

LEAVE A REPLY