‘ద్వారక’పై మెగా ముద్ర !

 Posted October 16, 2016

vijay-dwaraka-movie-trailer‘పెళ్లి చూపులు’ ఫేం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ద్వారక’. శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకుడు. విజయ్ సరసన పూజా జవేరి జతకట్టనుంది. పెళ్లి చూపులు తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘ద్వారక’పై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ద్వారక కి మెగా మద్దతు కూడా తోడైనట్టయింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘ద్వారక’ మోశన్ పోస్టర్ రిలీజైంది. ‘ఖైదీ నెం. 150’లో ఈ కార్యక్రమం జరిగింది. దీంతో.. ద్వారక చిత్రానికి మెగా అబిమానుల మద్దతు తోడవ్వనుందంటున్నారు. తన అభిమాన నటుడైన చిరంజీవి చేతుల మీదుగా పోస్టర్‌ రిలీజ్‌ కావడం సంతోషంగా ఉందని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నారు.  ఈనెల 16 న హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్టు సమాచారమ్.

dwaraka-movie-motion-poster

NO COMMENTS

LEAVE A REPLY