చిన్నవాడు బాలీవుడ్ కి వెళ్తున్నాడంట..!!

Posted February 7, 2017 (3 weeks ago)

ekkadiki pothavu chinnavada movie remake in bollywood
గతేడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన సినిమాల్లో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఒకటి. నోట్ల రద్దు తర్వాత రిలీజైనా ఘనవిజయం సాధించిన ఈ చిన్న సినిమా త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానుంది.

హర్రర్ జానర్ లో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ నిఖిల్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు అతని రేంజ్ ని కూడా ఓ మెట్టు పెంచింది. అలాగే ఈ చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ కు కూడా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. దీంతో ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళ్ రీమేక్ లో జివి ప్రకాష్ హీరోగా నటిస్తున్నాడని, తనకు ఖాళీ లేకపోవడంతో వేరే ఇంకో కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడని తెలిపిన ఆనంద్… హిందీ రీమేక్ కి మాత్రం తానే దర్శకత్వం వహిస్తానని చెప్పుకొచ్చాడు. కానీ ఈ చిత్రాన్ని అల్లు శిరీష్ తో చేస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ పూర్తయ్యాకే మొదలుపెడతామని అంటున్నాడు. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హాలను సెలెక్ట్ చేయనున్నామని తెలిపాడు. మరి టాలీవుడ్ లో బాగానే కలెక్షన్లను సాధించిన ఈ సినిమా బాలీవుడ్ అభిమానులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY