ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత‌…

0
93

Posted November 26, 2016 (1 week ago)

Image result for fidel castro dead

క్యూబా విప్ల‌వ పోరాట యోధుడు, ఆదేశ మాజీ అధ్య‌క్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూశారు. క్యూబా జాతిపిత‌గా ప్ర‌ఖ్యాతిగాంచిన ఆయ‌న‌ .. జీవితమంతా తాను న‌మ్మిన క‌మ్యూనిస్ట్ సిద్ధాంతాల కోస‌మే ప‌నిచేశారు. 1959లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలటరీ ఆధిపత్యాన్ని కూలదోసిన క్యాస్ట్రో.. పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేశారు. క్యూబాను దాదాపు 5 దశాబ్దాల పాటు ఆయన పాలించారు. 1959 నుంచి 1976 వరకూ ప్రధానిగా పని చేశారు. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా దేశానికి మార్గనిర్దేశనం చేశారు. 2006లో తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పార్టీ అధ్యక్ష పదవితో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఆయన చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో ప్రజల ముందుకి వచ్చారు.

క‌్యూబా విప్ల‌వ నేత‌గా అమెరికాకు వ‌ణుకు పుట్టించిన ఫిడెల్ క్యాస్ట్రో.. తూటాల్లాంటి త‌న మాట‌ల‌తోనే దేశ ప్ర‌జ‌ల‌ను ఉత్తేజితుల‌ను చేశారు. అమెరికాకు సమీపంలోనే ఉన్నప్పటికీ, ఆ దేశ సామ్రాజ్యవాద భావజాలానికి ఆది నుంచి వ్యతిరేకంగా పనిచేశారు. అమెరికాకు పొరుగునే ఉన్నప్పటికీ ఆ దేశంతో శత్రువు తరహాలోనే వ్యవహరించారు. తమకు కంట్లో నలుసులా మారిన ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నాలు చేసింది. క్యూబాపై అమెరికా ఆంక్షలను విధిస్తే.. ట్రాక్టర్ల బదులు గుర్రాలతో వ్యవసాయం చేసి చూపించాడు ఫిడెల్ క్యాస్ట్రో.

NO COMMENTS

LEAVE A REPLY