గుంటూరు కారం ఘాటు ఖమ్మం నుంచే అట…

Posted November 26, 2016 (2 weeks ago)

Image result for fake chilli powder

గుంటూరులో కల్తీ కారం తయారవుతున్నా ముడి సరుకు మొత్తం ఖమ్మం జిల్లా నుంచే తెస్తున్నారట ఖమ్మం కేర్ అఫ్ కారం ప్రస్తుతం ఏపీలో బయటపడుతున్న కల్తీ కారం నిల్వలు, కోల్డ్‌ స్టోరేజీలో ఉంచిన నిల్వలు మొత్తం తెలంగాణ లోని ఖమ్మానివే ….

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చైనా ఫ్యాక్టరీగా పిలువబడే మిల్లులో మిరపకాయలనుంచి రంగు, నూనెను వేరు చేస్తారు. వేరు చేసిన వ్యర్ధాలని విజయవాడ మీదుగా గుంటూరుకు తరలించి అక్కడ కల్తీ కారం తయారు చేస్తున్నారు. చైనా ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి బయో పవర్‌ ప్లాంట్‌కు ఆయా వ్యర్థాలను వాడుకుంటామని చెప్పి.. టన్ను రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేసి దానిని కల్తీకారం తయారీకి వాడుతున్నట్టు సమాచారం .గుంటూరు కారం కల్తీ అయినట్టు రుజువయింది. మిర్చిపొడిలో విషపూరిత పదార్థాలు కలిసినట్టు నిర్ధారణ అయింది. భువనేశ్వరి ఇండస్ట్రీస్ లో సేకరించిన నాలుగు నమూనాల్లోనూ రోడోమిన్ బీ, సుడాన్, రెడాక్సైడ్‌ రసాయనాలు ఉన్నట్లు హైదరాబాద్‌ ల్యాబ్‌ అధికారులు తేల్చారు. మిరపకాయల్లో ఫంగస్‌ ఉన్నట్లు గుర్తించారు

NO COMMENTS

LEAVE A REPLY