గాలి విందు మెనూ 50 పేజీలా?

Posted November 8, 2016

galii daughter food menu
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో విశేషాలు బయటకొచ్చాయి. వాటిని చూసి ఆశ్చర్యపోవడం జనం వంతవుతోంది.ఇప్పుడు మరో వార్త బయటికొచ్చింది. పెళ్లినాటి విందు కోసం ఏకంగా 1000 రకాల వంటలు తయారు చేస్తున్నారంట.ఈ వంటకాల పేర్లు వరసగా ముద్రిస్తే ఆ మెనూ దాదాపు 50 పేజీల ఉంటుందని ఓ అంచనా.దేశీయ,విదేశీ వంటకాలన్నీ గాలి వారింటి పెళ్ళిలో ఆహ్వానితులకు అందుబాటులో ఉంటాయి. అతిధుల స్థాయిని బట్టి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది .మొత్తం మీద కేవలం వంటకాల కోసమే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు.పోదురు బడాయి …అంత ఖర్చు ఎందుకు అవుతుంది అని డౌట్ వస్తోందా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి…కర్ణాటక ప్రజలంతా మా ఇంటి పెళ్ళికి తరలిరావాలని గాలి స్వయంగా పిలుపునిచ్చారు.ఇలా బహిరంగ ఆహ్వానం ఇచ్చిన పెళ్లి రాజుల కాలంలో ఏమైనా జరిగి ఉంటుందేమో! ఆ స్థాయిలో పెళ్లి చేస్తుంటే వంటకాలకు 100 కోట్లు ఖర్చు కావా మరీ?

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY