వరల్డ్ టాప్ 100 ఫొటోల్లో జాతి పిత గాంధీ చరఖా ఫోటో…

0
27

Posted December 1, 2016 (1 week ago)

 

రఘుపతి రాఘవ రాజారామ్ పతీత పావన సీతారాం సబ్కో సన్మతి దే భగవాన్ ఈశ్వర్ అల్లాహ్ తేరో నామ్ ఇది దాదాపు తెలియని వారుండరు ఎక్కువగా జాతి పిత మహాత్మాగాంధీ ని చుపిస్తున్నపుడో లేదా అయన కి సంబంధించిన మరేదైనా చూస్తున్నపుడో వింటాం, అహింస మార్గాన్ని అనుసరించి భారత దేశ స్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపించిన మహోన్నత వ్యక్తి మన బాపూజీ ..కెమెరా అయన చరఖా వొడుకుతున్న దృశ్యం సుపరిచితమే..ఇపుడు ఆ దృశ్యమే ప్రపంచ 100 ఫోటో ల్లో ఒకటి గా గుర్తింపు పొందింది .

Image result for mahathma gandhi

జాతిపిత మహాత్మా గాంధీ 1946లో చరఖాతో నూలు వడుకుతున్న ఫొటోకు అరుదైన జాబితాలో చోటు దక్కింది. ప్రపంచంలోనే 100 ప్రభావశీలియైున ఫొటోలలో ఇది ఒకటని టైమ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిందిభారత దేశ నాయకులపై కథనం రాయడం కోసం ఈ ఫొటోను 1946లో తీశారు. కానీ, గాంధీజీ మరణించిన అనంతరం ఆయనకు నివాళి అర్పిస్తూ రాసిన వ్యాసాలలో దీనిని ప్రచురించారు. ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిచ్చిందని టైమ్స్‌ తెలిపింది. 1820 నుంచి 2015 వరకు ప్రపంచ దేశాలపై అధికంగఆ ప్రభావం చూపిన ఫొటోల నుంచి టైమ్స్‌ 100 ఫొటోలను ఎంపిక చేసింది

NO COMMENTS

LEAVE A REPLY