నయీమ్ తో ఏ నల్గొండ నేత కుమ్మక్కు ?

  gangstar nayeem nalgonda majee manthri partners

నయీమ్ అక్రమాల సామ్రాజ్యం కుప్పకూలుతోంది.ఇన్నాళ్లు అతనికి నల్గొండ జిల్లాకి చెందిన ఓ మాజీ మంత్రి కొమ్ము కాసినట్టు తెలుస్తోంది .పోలీసు దర్యాప్తులో వెల్లడైన విషయాలు అందుకు ఊతమిస్తున్నాయి .ఆ నేతపై ఖాకీలు కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.విషయం లీక్ అయిన వెంటనే కొందరి పేర్లపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి .ఇందులో ఉమామాధవ రెడ్డి గురించి కూడా కొందరు వేలెత్తి చూపుతున్నారు.అయితే నయీమ్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె చెప్పారు .దీనిపై వివరణ ఇచ్చేందుకు కాసేపట్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు .

NO COMMENTS

LEAVE A REPLY