గౌతమ్ నంద గా రానున్న గోపీచంద్

Posted February 4, 2017

gopichand new movie gautham nandaకెరీర్ స్టార్టింగ్ లో హీరోగా ట్రై చేసి వర్కౌట్ కాకపోవడంతో విలన్ గా మారి తిరిగి హీరో అవ్వడానికి ఇబ్బందులు పడ్డ గోపీచంద్ ఇప్పుడు యాక్షన్ హీరో ఇమేజ్ ని సాధించుకున్నాడు. ఇంతకు ముందు ఏడాదికి రెండు సినిమాలు చేసినా అవి ఫ్లాప్ అవ్వడంతో కాస్త స్పీడ్ తగ్గించి హిట్ కొట్టే విషయంపైనే  కాన్సన్ ట్రేట్ చేసిన ఈ హీరో ఇప్పుడు ఏడాదికి కేవలం ఒక్క సినిమానే చేస్తున్నాడు.

అయితే గత ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా అభిమానులను నిరాశ పెట్టిన గోపీచంద్ ఈ సంవత్సరం మాత్రం వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే ఆక్సిజన్ సినిమాకు గుమ్మడికాయ కొట్టి నెక్ట్స్  సినిమా ఫై ఫోకస్ పెట్టాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హీరో సినిమా  ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్బగా  గోపీచంద్  ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పటి వరకు మాస్ లుక్ లో  యాక్షన్ హీరోగా కన్పించిన గోపీచంద్ ఈ పోస్టర్ లో మాత్రం స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. ఏప్రిలో విడుదలకు సిద్దమవుతున్న గౌతమ్ నంద అభిమానులను ఎలా అలరిస్తాడో చూడాలి.

Post Your Coment
Loading...