సెల్వంకే ఫస్ట్ ఛాన్స్?

Posted February 10, 2017 (3 weeks ago)

governor gave first chance to selvam
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు … పన్నీర్ సెల్వంకు బల నిరూపణ చేసుకునే అవకాశం కల్పించారా? ఇందుకోసం వారం రోజుల గడువిచ్చారా ? మంగళవారం లేదా బుధవారం బలనిరూపణకు ఆయన సిద్ధమవుతున్నారా ? అంటే ఔననే ప్రచారం జరుగుతోంది.

రాజ్యాంగ పరిశీలకులతో గవర్నర్ విద్యాసాగర్ రావుతో మంతనాలు జరిపారట. అన్నీ ఆలోచించి పన్నీర్ సెల్వం కు బల నిరూపణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకు వారం రోజుల గడువు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అందుకే సెల్వం నోటి వెంట బల నిరూపణ మాట వచ్చిందని టాక్.

బల నిరూపణకు పన్నీర్ సెల్వం పక్కా ప్లాన్ తో సిద్ధమవుతున్నారట. ఇప్పటికే తనకు మద్దతు పలికే వారి లిస్టును సిద్ధం చేసుకున్నారని టాక్. అయితే సోమవారం శశికళకు సంబంధించి… అక్రమాస్తుల కేసు తీర్పు రానున్న నేపథ్యంలో అప్పటివరకు కొంత వేచి చూసే ధోరణిలో ఉన్నారట. శశికళకు శిక్ష పడుతుందా? లేదా ఆమె కేసు నుంచి బయటపడుతుందా? అన్నది సోమవారం తేలనుంది. ఒకవేళ ఆమె కేసు నుంచి బయటపడితే ఎమ్మెల్యేల మద్దతు సమీకరించడం కొంత కష్టం. అయినప్పటికీ డీఎంకే మద్దతు ఉంది కాబట్టి ఏదో ఒకటి చేసే అవకాశమైతే పన్నీర్ కు ఉంది.

కోర్టు తీర్పు చిన్నమ్మకు వ్యతిరేకంగా వస్తే సెల్వం పంట పండినట్టే. చిన్నమ్మ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆయనకే మద్దతు పలికే అవకాశముంది. సెల్వం చాలా ఈజీగా బలాన్ని నిరూపించుకుంటారు. అందుకే తీర్పు ఎలా వచ్చినా… బలనిరూపణకు ఎలాంటి చిక్కులు లేకుండా పన్నీర్ ప్రిపేర్ అవుతున్నారట. మంగళవారం లేదా బుధవారం బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమని గవర్నర్ కు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అందులో ఆయన గట్టెక్కుతారా? లేదా లాస్ట్ బాల్ వరకు పోరాడి ఓడుతారా? అన్నది వారం రోజుల్లోపే తేలిపోనుంది.

NO COMMENTS

LEAVE A REPLY