గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో డేట్ వచ్చింది..

Posted [relativedate]

gowthami putra satakarni movie audio details
నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల తేదీ ఖరారయ్యింది.డిసెంబర్ 16 న గౌతమీపుత్ర శాతకర్ణి పాటలు రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమా ఆడియో ఓ నెల ముందే రిలీజ్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేశారు.ఈలోగా పెండింగ్ ఉన్న కొద్ది సన్నివేశాలు,పాటల చిత్రీకరణ,గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసేందుకు యూనిట్ కష్టపడుతోంది.

గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.ఆడియో విడుదల కార్యక్రమ వేదిక ఎక్కడన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.అమరావతి లేదా తిరుపతి కావొచ్చని తెలుస్తోంది.