H 1 B వీసా లో నిబంధనల మార్పు

0
26

Posted December 1, 2016 (1 week ago)

Image result for h1b visa in america

అమెరికాకు వచ్చి పనిచేసే వృత్తి నిపుణుల హెచ్‌-1బీ వీసాను ఏ కారణం చేతనైనా ఇమిగ్రేషన్‌ అధికారులు రద్దు చేసిన పక్షంలో, వారు అమెరికా లో కొనసాగేందుకు ప్రభుత్వం 60 రోజుల వ్యవధి ఇవ్వనుంది. ఈలోగా వారు స్వదేశానికి వెళ్లడమో లేక కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోడానికి అనుమతిస్తారు. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి హెచ్ 1B వీసా లో మార్పులు అమల్లోకి రానున్నాయి.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు భారతీయ సాఫ్ట్‌వేర్‌ నిపుణులలో ఒకపక్క గుబులు రేపుతుండగా, అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్‌)నిబంధనలలో చేసిన కొన్ని కీలక మార్పులు ఇప్పటికే హెచ్‌-1బీ వీసా పొందిన వారికి సానుకూలంగా మారాయి.

హెచ్‌4 వీసా ఉన్నవారి విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా కీలక మార్పుగా చెప్పవచ్చు. హెచ్‌-1బీ వీసా కలిగిన వారి జీవితభాగస్వాములుగా అమెరికాకు వచ్చే హెచ్‌4 వీసాకలిగిన వారి ఉద్యోగ నియామకాల ధ్రువీకరణ విషయంలో ఇచ్చిన వెసులుబాటు వల్ల వారికి ఇబ్బందులు తొలగినట్టే. ఈ కొత్త నిర్ణయంవల్ల హెచ్‌4 వీసా కింద అమెరికా వచ్చి పనిచేసే ఉద్యోగులు తమ గడువు పొడిగింపునకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూడకుండా యథాప్రకారం పనిచేసుకోవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY