హరికృష్ణ అనుభూతులు..

0
70

Posted October 6, 2016

  harikrishna said ntr kalyan ram

“ఇపుడు నా వ‌య‌సు 60. ఈ జీవితంలో ఎవ‌రూ పొంద‌లేని, అనుభూతులను నేను పొందాను. మహానుభావుడు నంద‌మూరి రామారావు గారి ద‌గ్గ‌ర 30 ఏళ్లు ప‌నిచేశా. ఆయ‌న‌తో నాకున్న అనుభ‌వాలు హిమాల‌య శిఖ‌రాల‌ను మించాయి. సినిమా రంగంలో ఆయ‌న‌తో ఎన్నో విజ‌యాలు చూశాను. రాజ‌కీయాల్లో పార్టీ పెట్టి పోరాటం చేసి 8 నెలల్లో గెలిచాం. వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానులు ఇవాళ మా సొంతం. డబ్బు పోవచ్చు. కానీ ఎవ‌రూ త‌స్క‌రించ‌లేనిది అభిమానం. 

తెలుగు ప్ర‌జ‌లు నా బిడ్డ‌ల‌కు ఆ అభిమానాన్ని పంచుతున్నారు. నా 59వ ఏట జూనియ‌ర్ టెంప‌ర్ హిట్ ఇచ్చాడు. క‌ల్యాణ్‌రామ్ ప‌టాస్ ఇచ్చాడు. నా 60వ ఏట జూనియ‌ర్ జ‌న‌తాగ్యారేజ్ బ్లాక్బస్టర్ ఇచ్చాడు. క‌ల్యాణ్ ఇప్పుడు ఇజంతో ముందుకు రాబోతున్నాడు. హిట్ కొడ‌తాడ‌నే న‌మ్మ‌కం ఉంది. 

నేను ఎప్పుడూ ఎవరికీ తల వంచను. కష్టం అయినా నష్టం అయినా అంతే. మా నాన్న క‌డుపున పుట్ట‌డ‌మే నేను చేసుకున్న మ‌హ‌ద్భాగ్యం. ఆయ‌న ఆశీస్సులు పిల్ల‌ల‌కున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట‌ను నా ఇద్ద‌రు పిల్ల‌లూ గుర్తుంచుకున్నారు. నా పెద్ద కుమారుడు త‌న త‌మ్ముళ్లు త‌ప్ప‌కుండా హిట్లు తీస్తార‌ని నాతో చెప్పేవాడు. అత‌ను లేక‌పోయినా అత‌ను న‌మ్మిన మాట ఉంది. ఆ మాట ప్ర‌కారం పిల్ల‌లిద్ద‌రూ హిట్లు కొట్టారు. పై నుంచి మా నాన్న‌, నా పెద్ద కుమారుడు వీళ్ల‌ను ఆశీర్వ‌దిస్తున్నారు ”  అని అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY