హుర్రే… అమరావతికి మేజర్ ఐటీ కంపెనీ వచ్చేస్తోందోచ్..!!

Posted February 9, 2017 (3 weeks ago)

hcl technologies company in amaravathiతెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నష్టపోయిన ఏపిని ప్రగతి పధంలో తీసుకువెళ్లడానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపి రాజధాని అమరావతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు ఆశయానికి  అనుగుణంగా పెద్దపెద్ద ఐటీ రంగ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. 

తాజాగా రూ.500 కోట్ల పెట్టుబడులతో అమరావతిలో ఐటీ సర్వీసులను ఏర్పాటు చేయడానికి  HCL కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రెండు దశల్లో ఐటీ, ఐటీఈఎస్ సర్విసులు అందించనున్నామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 2018 అక్టోబరు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. దీంతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వెల్లడించారు.

ఇప్పటి వరకు ఒకటి రెండు చిన్నా చితక  ఐటీ కంపెనీలు అమరావతికి వచ్చినా HCL వంటి మేజర్ ఐటీ సంస్ధ తమ రాజధానికి  వస్తుంన్నందుకు ఏపి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్తు చక్కబడనుందని భరోసా వ్యక్తం చేస్తున్నారు. HCL వంటి పలు పెద్ద పెద్ద కంపెనీలు తమ రాజధానికి తరలిరావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY