పవన్ కూడా ఆమెకు ఫిక్స్

Posted [relativedate]

Heroine Fixed For Pawan Trivikram Movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్లో మూవీకి ముహుర్తం ఈ మధ్యనే జరిగిందని తెలిసిందే. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేశారట. ఈ విషయం స్వయంగా కీర్తి సురేష్ తన సోషల్ బ్లాగ్స్ లో రివీల్ చేసింది. పవన్ త్రివిక్రం కాంబినేషన్ మూవీ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. నేను శైలజతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం నానితో నేను లోకల్ మూవీలో నటిస్తుంది.

క్యూట్ లుక్స్ తో యువత మనసు దోచేస్తున్న కీర్తి నటన మెచ్చిన త్రివిక్రం సినిమాలో ఆమెను ఫైనల్ చేశారట. పవన్ కళ్యాణ్ కూడా కీర్తి హీరోయిన్ గా ఒప్పేసుకున్నాడట. కొద్ది నిమిషాల క్రితమే కన్ఫాం అయిన ఈ న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కే కాదు కీర్తి అభిమానులను ఖుషి అయ్యేలా చేస్తుంది. ఇక పవన్ సినిమానే కాకుండా కొరటాల శివ, మహేష్ బాబు కాంబోలో మూవీకి కీర్తి సురేష్ పేరు వినబడుతుంది.

ఒకవేళ అది కూడా ఓకే అయితే ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్స్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. కేవలం తెలుగులో రిలీజ్ అయిన ఒక సినిమా నటిస్తున్న మరో సినిమాతోటే స్టార్స్ ను సైతం ఎట్రాక్ట్ చేసిన కీర్తి చూస్తుంటే స్టార్ హీరోయిన్ గా టాప్ చెయిర్ సంపాదించేలానే ఉంది.