నన్ను అలా గుర్తిస్తున్నారు..!

Posted [relativedate]

Heroine Poorna About Her Tollywood Careerటాలీవుడ్లో చిన్న సినిమాల్లో దెయ్యం పాత్ర కావాలంటే ముందు ఆమెనే అడుగుతారు. రవిబాబు అవునుతో ఏర్పరచుకున్న ఆ క్రేజ్ రాజు గారి గది దాకా కొనసాగింది. అయితే తనలోని నటిని అలా గుర్తించారంటున్న పూర్ణ తనకు వస్తున్న అవకాశాల పట్ల సాటిస్ఫైడ్ గా ఉన్నా తనకు గ్లామర్ రోల్స్ చేయాలని ఉందని చెబుతుంది పూర్ణ. ఆమె నటించిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా రేపు ప్రేక్షకులముందుకు రాబోతుంది ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చాలా విషయాలు చెప్పింది.

చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టమన్న పూర్ణ ఆ డ్యాన్స్ వల్లే తాను ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నానని అన్నది. ఇక పరిశ్రమలో రాణించాలంటే కేవలం టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలని అంటుంది పూర్ణ. శ్రీనివాస్ రెడ్డితో జంటగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ ఏర్పరచుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్లో జరిగిందని తెలిసిందే.

మరి తను కోరుకున్న లక్ ఈ సినిమాతో అందుకుంటుందో లేదో మరో 24 గంటలు ఆగితే సరిపోతుంది. ఈమధ్య కాలంలో రొటీన్ గా దెయ్యం పాత్రల్లోనే నటిస్తూ రావడం చేత పూర్ణ ఒంటరిగా పడుకోవాలన్నా భయపడుతుందట. తన సినిమాలు తననే భయపెడుతుంటే ఇక మిగతా ఆడియెన్స్ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.