బన్ని, ఎన్టీఆర్ ఇద్దరికి షాక్..!

Posted November 21, 2016

Heroine Shock To Bunny, Ntr Tollywoodహీరోయిన్స్ అన్న తర్వాత స్టార్స్ తో అవకాశాల కోసమే ఎదురుచూస్తారు. ఒక్కసారి స్టార్ హీరో పక్కన చేస్తే ఆయన ఫ్యాన్స్ అంతా ఆ హీరోయిన్ ను ఫాలో అయ్యే అవకాశాలుంటాయి. అయితే ఓ కుర్ర హీరోయిన్ మాత్రం ఏకంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల ఛాన్స్ వచ్చినా కాదనేసిందట. ఏంటి తారక్, బన్నిల ఛాన్సులు వదులుకుందా ఎవరామె అంటే పూజా హెగ్దె అంటున్నారు.

తారక్ జనతా గ్యారేజ్, బన్ని సరైనోడు సినిమాల్లో పూజా హెగ్దెను తీసుకోవాలని చూశారట. అయితే అప్పటికే ఆమె హృతిక్ రోషన్ మొహెంజోదారో సినిమా షూట్ లో ఉంది. ఆ సినిమా కమిట్మెంట్ ప్రకారం అది పూర్తయ్యే దాకా వేరే సినిమాలకు పనిచేయకూడదు. అందుకే జూనియర్, బన్ని ఇద్దరు తమ సినిమాలో అవకాశాలు ఇచ్చినా అవి చేయలేకపోయింది ఈ చిన్నది.

బన్నితో ఒక ఛాన్స్ మిస్ అయినా ప్రస్తుతం చేస్తున్న దువ్వాడ జగన్నాథంలో మళ్లీ ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Post Your Coment
Loading...