మైసూరా రెడ్డి మీ బ్యాంకు బాలన్స్ ఎంత.. హై కోర్ట్

Posted November 29, 2016

Image result for mysoora reddy
ఎమ్ వీ మైసూరా రెడ్డి ని తన అకౌంట్ లో బాలన్స్ ఎంత ఉందో చెప్పాలని హై కోర్ట్ సూటిగా ప్రశ్నించింది..పెద్ద నోట్ల రద్దుపై మాజీ మంత్రి మైసూరారెడ్డి వేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకొచ్చింది. కేంద్రం ముందే చెప్పింది కదా సమస్యలుంటాయని అని పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం పై మీరు స్పందించడానికి కారణమేంటని, మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నమాట వాస్తవమేనని, నెలాఖరు కావున జీతాల కోసం కొంత వెసులు బాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్ట్ అభిప్రాయం వ్యక్తం చేసిందట. కందకి లేని దురద కత్తిపీటకు అంటే ఇదే ..అశేష జనం రద్దు ని స్వాగతిస్తుంటే పిటీషన్ అంటూ ఇలాంటి పనులు చేస్తే మనకే నష్టం మరి కోర్ట్ మొట్టికాయ సరిపోయిందో లేదో మైసూరన్నకి ..

Post Your Coment
Loading...