బాలయ్యకు ఎమ్మెల్యేగా ఘోర అవమానం..!

Posted April 19, 2017 (1 week ago)

hindupur constituency people rally against balakrishna because of water problem
హీరోగా నందమూరి బాలకృష్ణ ఎన్నో రికార్డులు క్రియేట్‌ చేశాడు. వెండి తెరపై హీరోయిజం చూపించడంలో తన తర్వాతే అంతా అని పలు సినిమాల్లో నిరూపించుకున్నాడు. అయితే రాజకీయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు బాలయ్య జీరో అవుతూ వస్తున్నాడు. గత ఎన్నికల్లో ఏరి కోరి మరీ అనంతపురం జిల్లా హిందూపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కొద్ది తేడాతో బాలకృష్ణ గెలుపు సాధించాడు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల నుండి మొదలు బాలకృష్ణపై ఏదో ఒక విమర్శలు లేదా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవలే కొందరు ప్రతిపక్ష నాయకులు బాలకృష్ణ హిందూపురంను పట్టించుకోవడం లేదని, అసలు బాలయ్య హిందుపురం రాక చాలా కాలం అయ్యింది, ఆయన కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హిందుపురంలో వేసవి సందర్బంగా ప్రజలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయినా కూడా బాలయ్య తన 101వ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. దాంతో ఆగ్రహించిన స్థానిక ప్రజలు నేడు హిందుపురంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. బాలకృష్ణను దున్నపోతుతో పోల్చుతూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. దున్నపోతు మీద వాన కురిసినట్లుగా బాలకృష్ణ తీరు ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దున్నపోతులపై బాలకృష్ణ ఎమ్మెల్యే అంటూ రాసి తమ నిరసన తెలియజేశారు.

Post Your Coment
Loading...