ముద్రగడ యాత్రకి బ్రేక్ పడ్డట్టే..

Posted November 14, 2016 (4 weeks ago)

home minister chinna rajappa no permission to mudragada padayatra
ఈ నెల పదహారు నుంచి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రకి బ్రేక్ పడేట్టే కనిపిస్తోంది.ముద్రగడ యాత్రకి ఎలాంటి అనుమతి లేదని ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు.మరోవైపు శాంతిభద్రతల దృష్ట్యా ఈ యాత్రని అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.ఇంకోవైపు ముద్రగడ కాపు సత్యాగ్రహ పాదయాత్ర తలపెట్టిన కోనసీమలో పోలీసుల్ని భారీగా మోహరించారు.

ముద్రగడ వైఖరిని తప్పుబడుతున్న చినరాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.తుని సభకి ముందు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలక్కుండా చర్యలు తీసుకుంటామని చెప్పి అనుమతి తీసుకుని తర్వాత రైలు దహనానికి పాల్పడ్డారని అయన అన్నారు.స్మార్ట్ పల్స్ సర్వే,మంజునాథ్ కమిషన్ నివేదికల తర్వాత కాపు రిజర్వేషన్ అమలయ్యే దిశగా చర్యలు చేపడుతున్నా ముద్రగడ రాజకీయం చేస్తున్నారని రాజప్ప ఆరోపించారు.యాత్ర తలపెట్టిన ముద్రగడ,హోమ్ మంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు…ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం …అదే సామాజిక వర్గానికి చెందిన సమస్య చుట్టూ దృష్టి కేంద్రీకృతం కావడం ఆసక్తి రేపుతోంది..
 

NO COMMENTS

LEAVE A REPLY