గాలికి ఐటీ ప్రశ్న పత్రం ఇదే ..

Posted November 22, 2016

income tax officers asked gali janardhan reddy questions listకుమార్తె పెళ్లి తో వార్తల్లోకెక్కిన గాలి జనార్దన్ రెడ్డి పై ప్రతిపక్షాల దాడి తో కళ్ళు తెరిచిన ప్రభుత్వం దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఐటీ అధికారులు ఒక సామజిక కార్య కర్త కంప్లైంట్ ని ఆధారం గా చేసుకొని దాడులు నిర్వహించారు పెళ్లి ఖర్చుల మీద ద్రుష్టి సారించి గాలికి ఒక పెద్ద ప్రశ్న పత్రం ఇచ్చారు .మీరు ఓ లుక్ వేయండి.

1. కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ?
2. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు ఖర్చు చేశారు ?
3. పెళ్లికి మొత్తం ఎంత డబ్బలు ఖర్చు చేశారు ?
4. ఆ సోమ్ము ఎక్కడి నుంచి సమకూర్చారు ?
5. ఆ సోమ్ము సమకూర్చిన వారెవరు ? వారి వివరాలు ఇవ్వండి.
6. వివాహానికి ఎంత మంది వచ్చారు ? వారికి చేసిన ఏర్పాట్లు ఏంటీ ?
7. వినోదం, వీడియో, వీవీఐపీ, వీఐపీల భద్రతకు ఎంత ఖర్చు చేశారు ?
8. పెళ్లికి ఖరీదైన ఆహ్వాన పత్రికలు ఎన్ని ముద్రించారు ? వాటిని ముద్రించిన సంస్థల వివరాలు ఏంటీ ?

9. పెళ్లికి బ్రహ్మాండమైన భోజనాలు సమకూర్చారు, ఆ ఖర్చుల పట్టి ఎంత ?
10. పెళ్లికి ఎంత మంది పురోహితులు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ? వారికి ఇచ్చిన సంభావనల వివరాలు ఏంటి ?
11. పెళ్లికి వచ్చిన అతిథులకు ఇచ్చిన కానుకలేంటి ?
12. పెళ్లికి నగదు రూపంలో ఎంత ఖర్చు చేశారు ? నగదు రూపంలో నిధులు సేకరించినట్లయితే ఆ నగదు అందించిన సంస్థలు, వ్యక్తుల పేర్లు,వివరాలు ఏంటీ?
13. డెబిట్, క్రిడిట్ కార్డుల్లో ఎంత మొత్తంలో నగదు తీసుకున్నారు ? వాటి వివరాలు ఏంటి ?

ఇలా 16 ప్రశ్నలతో గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు ఓ తాఖీదు జారీ చేశారు.ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి సమాచారం, వివాహానికి సంబంధించిన బిల్లులు అన్ని తమకు సమర్పించాలని ఐటీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద పెళ్లి ఖర్చుల పూర్తి వివరాలు ఐటీ శాఖ అధికారులకు ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డి సిద్దం అయ్యారని తెలిసింది.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY