దేశ సరిహద్దుల్లో టెన్షన్…

Posted September 30, 2016

  india pakistan border war tension

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత భద్రతాదళాలు సంసిద్ధంగా వున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వున్న యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తున్నాయి. సరిహద్దు గ్రామాల్ని ఖాళీ చేయించే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆకాశ మార్గంలో వైమానిక దళాల గస్తీ కొనసాగుతోంది.

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో సరిహద్దుల వద్ద పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. గడిచిన 48 గంటల్లో ఆదేశం కవ్వింపు చర్యలకు పాల్పడడం ఇది ఐదోసారి. ఈ పరిస్థితుల్లో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథే ఉన్నతాధికారులతో సమావేశమై అంతర్గత భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. అటు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అనుక్షణం ఆర్మీ అధికారులతో టచ్ లో వుంటూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు…

Post Your Coment
Loading...