జస్ట్ మిస్.. చరణ్ కు ‘సరైన’ హిట్ పడేదే..!

Posted [relativedate]

Is Charan Missed Super Hit Movie Sarrainodu..?.సంవత్సరం క్రితం ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన బ్రూస్ లీ ఫ్లాప్ అవడంతో రాబోతున్న ధ్రువ ఎలాగైనా హిట్ కొట్టి తన కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచి బన్ని కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన సరైనోడు సినిమా చరణ్ చేసుంటే.. ఏంటి కామెడీ అనుకుంటున్నారు కదా.. బోయపాటి సరైనోడు కథ ముందు చరణ్ కే చెప్పాడట. కాని ఎక్కడో తేడా కొడుతుందని సారీ అన్నాడట.

ఇక సరైన మాస్ మసాలా సినిమా కోసం ఎదురుచూస్తున్న బన్ని ఊర మాస్ కథ సరైనోడికి సరే అని చెప్పడం సూపర్ హిట్ కొట్టడం అంతా జరిగింది. ఒక్కోసారి డైరక్టర్ కథ చెప్పినప్పుడు మాములుగా అనిపించినా ఆ సినిమా మిస్ చేసుకున్నాక వేరే హీరో ఆ కథలో విజృంభిస్తే కాస్త బాధగానే ఉంటుంది. చెర్రి మిస్ అయిన సరైనోడు బన్నికి లక్కీగా తగిలింది. అయితే ఆ సినిమా మిస్ చేసుకున్నా బోయపాటితో మళ్లీ అలాంటి కథతో ఈసారి వస్తే తప్పకుండా చేసే ఆలోచనతో ఉన్నాడట చరణ్. ప్రస్తుతం ధ్రువ తర్వాత సుకుమార్ తో కమిట్ అయిన చరణ్ ఆ తర్వాత కూడా వరుసెంట సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.